మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య

గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటికి సమీపంలో ఉన్న తన గదిలో చెన్నకేశవరావు తన రివాల్వర్ తో కాల్చుకుని..;

Update: 2023-01-24 06:39 GMT
escort chennakesava rao

escort chennakesava rao

  • whatsapp icon

ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గతరాత్రి (సోమవారం) 9గంటలకు ఈ ఘటన జరిగింది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటికి సమీపంలో ఉన్న తన గదిలో చెన్నకేశవరావు తన రివాల్వర్ తో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.

ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే ఆయన బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు.


Tags:    

Similar News