శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అధికారుల సోదాల్లో 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్లు దొరికాయి;

Update: 2022-02-15 03:51 GMT
foreign currency, shamshabad airport, customs officer
  • whatsapp icon

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల సోదాల్లో ముప్ఫయి లక్షల విలువ చేసే యూఎస్ డాలర్లు దొరికాయి. తొలుత సీఐఎస్ఎఫ్ అధికారులు ఈ విదేశీ కరెన్సీని గుర్తించారు. ప్రయాణికుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. షార్జా వెళ్లేందుకు మహమూద్ ఆలీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు.

లగేజ్ బ్యాగ్ లో....
అధికారులకు అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ ను తన లగేజీ బ్యాగ్ లో దాచి తరలించేందుకు మహమూద్ ఆలీ ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది తనిఖీలో బయటపడుతుంది. మహమూద్ ఆలీని అరెస్ట్ చేసిన అధికారులు అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News