విషాదం.. కృష్ణానదిలో నలుగురు చిన్నారులు మృతి

కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మరణించారని తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని..;

Update: 2023-06-05 11:33 GMT
4 dead in krishna river

4 dead in krishna river

  • whatsapp icon

వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు పిల్లలు, యువకులు సరదాగా సమీపంలోని చెరువులలో, నదుల ఒడ్డున ఈత కొడుతుంటారు. అలా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద కృష్ణా న‌దిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మరణించారని తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. మృతులు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన అఫ్రీన్(17), సమీర్ (8), నౌషిన్(7), రిహన్(15)గా పోలీసులు గుర్తించారు. నదిని చూసేందుకు ఆటోలో 11 మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో నలుగురు ఈతకు దిగి మరణించారు. చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు.





Tags:    

Similar News