దారుణం.. నెల్లూరులో విదేశీ యువతిపై అత్యాచారయత్నం
ఈ దారుణ ఘటన సైదాపురానికి సమీపంలో జరిగింది. సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులో జార్జియాకు చెందిన మహిళపై కొందరు గుర్తు..
నెల్లూరు : జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన విదేశీ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సైదాపురానికి సమీపంలో జరిగింది. సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులో జార్జియాకు చెందిన మహిళపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెప్పిన వివరాల మేరకు ఘటనా ప్రాంతాన్ని గుర్తించి, పరిశీలించారు.
జార్జియాకు చెందిన యువతి కృష్ణపట్నం పోర్టును చూసేందుకు రాగా.. క్యాబ్ డ్రైవర్ సైదాపురంలో ఉన్న మైనింగ్ క్వారీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పాటు.. పలువురు అక్కడికి చేరుకుని యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.