నంద్యాల జిల్లాలో దారుణం.. పెట్రోల్ పోసి?
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది రెచ్చి పోయాడు. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది రెచ్చి పోయాడు. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో ఇంటర్ విద్యార్థినిపై దాడి చేశాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఈ ఘటన జరిగింది. పెట్రోలు దాడిలో బాలిక మరణించింది. దీంతో నందికొట్కూరు పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. విద్యార్థిని అక్కడికక్కడే మరణించడంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హోంమంత్రి ఆగ్రహం...
నంద్యాల జిల్లా నందికొట్కూరులో బాలికపై పెట్రోల్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థినిపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనపై సమగ్ర విచారణ సత్వరమే జరపాలని ఆదేశించారు. పెట్రోల్ దాడి ఘటనలో బాలిక మృతి అత్యంత బాధాకరమన్న అనిత నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా సంఘటన స్థలాన్ని పరిశీలించాలని హోంమంత్రి ఆదేశించారు.