Actress Sobhitha : నటి శోభిత మృతి కేసులో ట్విస్ట్
కన్నడ సీరియల్ నటి శోభిత అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
కన్నడ సీరియల్ నటి శోభిత అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శోభిత గదిలో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కన్నడ సీరియల్స్ లో నటించిన శోభిత, 2023 లో వివాహం చేసుకుంది. ఇటీవలే శోభిత దంపతులు గోవా ట్రిప్ కు కూడా వెళ్లి వచ్చారు. అయితే శోభిత మృతికి కారణాలేమయి ఉంటాయా? అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
డిప్రెషన్ కు లోనయి...
శోభిత డిప్రెషన్ కు లోనై బలవన్మరాణికి పాల్పడిందా? లేక కలహాలు కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శోభిత గదిలో లభించిన లేఖలో ఎస్ యూ కెన్ డూ ఇట్ అని మాత్రమే రాసి ఉంది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతదేహానికి పోస్టుమార్టం చేసి నేడు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.