Road Accident : ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురి స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టి అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు.;
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టి అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. పల్నాడు జిల్లా బ్రహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మరో నలుగురు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కారును అతి వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
కొండగట్టుకు వెళ్లివస్తుండగా...
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుక ప్రయత్నిస్తున్నారు. మృతులను నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని తెలిసింది.