Road Accident : ఘోరరోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ హైవే పై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గాయాలు కావడంతో....
ఈ ప్రమాదంలో బస్సు ముందు కుడిభాగం నుజ్జునుజ్జు అయింది. ఎనిమిది మంది ప్రయాణికులు మరణించగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.