గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు

Update: 2024-12-08 04:26 GMT

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ సిద్ధిపేట జిల్లా పెద్దకోడూరు, గాడిచర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వెంకటేష్, పరంధాములు ఇద్దరూ పోలీస్ కానిస్టేబుళ్లగా పనిచేస్తూ హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ద్విచక్రవాహనాన్ని...
అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. కానిస్టేబుళ్లు ఇద్దరు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News