Road Accident : తెలంగాణలో చెరువులో దూసుకెళ్లిన కారు... ఐదుగురు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు మరణించారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులో పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకులు మరణించారు. అతి వేగంగా వస్తుండటం, నిద్రమత్తు కారణంగానే కారు అదుపు తప్పి చెరువులో పడి ఉంటుదని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.
మృతులందరూ...
మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు వారి మృతదేహాలను కారు నుంచి బయటకు వెలికి తీసి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నార. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులుండగా ఐదుగురు మరణించారు. ఒకరు తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. అయితే మృతుల పేర్లు మాత్రంఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు