Road Accident : ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఇల్లు.. ఈలోపు ప్రమాదం... ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాల్వలోకి అదుపుతప్పి కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లు మరణించారు.
అరకు వెళ్లి వస్తుండగా...
భర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. నేలపూడి విజయకుమార్ తన భార్య పిల్లలతో కలసి అరకు వెళ్లి ఎంజాయ్ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరి స్వగ్రామం పోతవరం. మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇల్లు చేరుకుంటారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును విజయకుమార్ భార్య ఉమ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.