దారుణం.. కోడల్ని వెంటాడి మరీ చంపేసిన మామ

సీతల్‌ సింగ్‌ దోసాంజ్‌ అనే వ్యక్తి అక్కడి వాల్‌మార్ట్‌లో పని చేసే తన కోడలు గురుప్రీత్‌ కౌర్‌ దోసాంజ్‌ని హత్య..;

Update: 2022-10-09 06:58 GMT
california, international news

father in law kills his daughter in law

  • whatsapp icon

అగ్రరాజ్యమైన అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంజోస్ లో వారం రోజుల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా బయటపడింది. ఓ మామ తన కోడల్ని వెంటాడి మరీ చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీతల్‌ సింగ్‌ దోసాంజ్‌ అనే వ్యక్తి అక్కడి వాల్‌మార్ట్‌లో పని చేసే తన కోడలు గురుప్రీత్‌ కౌర్‌ దోసాంజ్‌ని హత్య చేశాడు. అందుకు కారం కోడలు తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని నిర్నయించుకోవడమే. కోడలిని హత్య చేసేందుకు ఫ్రెస్నోలో నుంచి 150 మైళ్లు ప్రయాణించి శాంజోస్‌కు వెళ్లాడు. వాల్‌మార్ట్‌ పార్కింగ్‌ ఏరియాలో కోడలిని తుపాకీతో కాల్చి చంపేశాడు.

పోలీసులు సీతల్ సింగ్ దోసాంజ్ ను అరెస్ట్ చేసి.. ఇంటిని తనిఖీ చేయగా అక్కడ పిస్టోల్ లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని మెర్సిడ్‌లో నలుగురు భారతీయులను కిడ్నాప్‌ చేసి హత్య చేయడం కలకలం రేపింది. జస్దీప్‌ సింగ్‌, ఆయన భార్య జస్లీర్‌ కౌర్‌, వారి కూతురు అరూహీతో పాటు ఈ కుటుంబానికి దగ్గర బంధువు అమన్‌ దీప్‌ సింగ్‌ మృత దేహాలను ఓ తోటలో గుర్తించారు. అమెరికా వరుసగా జరుగుతున్న భారతీయుల హత్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.



Tags:    

Similar News