అప్పుడే పుట్టిన పసికందు పట్ల తల్లిదండ్రుల అమానుషం.. సలామ్ పోలీస్ (VIDEO)

కుషాయి గూడ పీఎస్ పరిధిలోని కమలా నగర్ లో.. అప్పుడే పుట్టిన పసికందును కసాయి తల్లిదండ్రులు ఓ అపార్ట్ మెంట్ లో..;

Update: 2022-12-18 10:43 GMT
Kushaiguda SI Saikumar, baby thrown into Apartment

Kushaiguda SI Saikumar

  • whatsapp icon

ఈ రోజుల్లో పిల్లల్ని కనలేక, పెళ్లై ఏళ్లు గడిచినా పిల్లలు కలగక బాధపడుతున్న దంపతులెందరో ఉన్నారు. కానీ.. కొందరు కసాయిలు మాత్రం.. తమ సుఖం కోసమో, ఆడపిల్లలు పుట్టారనో అప్పుడే పుట్టిన పిల్లల్ని కనీసం తమ బిడ్డని ఆలోచన లేకుండా.. తమకేమీ సంబంధం లేనట్టు చెత్తకుప్పల్లో, ఆస్పత్రుల బయట, గుబురుగా ఉండే చెట్ల వద్ద వదిలేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.

కుషాయి గూడ పీఎస్ పరిధిలోని కమలా నగర్ లో.. అప్పుడే పుట్టిన పసికందును కసాయి తల్లిదండ్రులు ఓ అపార్ట్ మెంట్ లో విసిరేశారు. పాపం ఆ చిన్నారి.. గుక్కపట్టి ఏడ్చింది. పై నుండి పడేశారో ఏమో గానీ.. చిన్నారికి గాయాలుకూడా అయినట్లు తెలుస్తోంది. చిన్నారి ఏడుపుతో ఏమైందని చూసిన అపార్ట్ మెంట్ వాసులు.. వెంటనే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారమిచ్చారు. కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకుని.. ఆ పసికందును చూసి చలించిపోయారు. పసికందును తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసిపాపకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆ పోలీస్ ను చూసిన స్థానికులు.. ఈ వార్త తెలిసిన వారు సలామ్ పోలీస్ అంటూనే.. పసికందును కనికరం లేకుండా వదిలేసిన తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని పడేసిన అపార్ట్ మెంట్ చుట్టుపక్కల వారిని విచారణ చేస్తున్నారు. 
ఆస్పత్రిలో 5 గంటలపాటు ప్రాణాలతో పోరాడి.. ఆ చిన్నారి కన్నుమూసింది.



Tags:    

Similar News