కన్నడ రాజ్యోత్సవ కోసం రిహార్సల్స్.. ప్రాణాలు విడిచిన 12 ఏళ్ల విద్యార్థి

కన్నడ రాజ్యోత్సవం రోజున జరగాల్సిన నాటకం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. చనిపోయిన విద్యార్థిని చిత్రదుర్గలోని ..;

Update: 2022-10-31 05:43 GMT

kannada rajyotsava

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి ఆదివారం తన ఇంట్లో నాటకం కోసం రిహార్సల్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం తన పాఠశాలలో కన్నడ రాజ్యోత్సవం రోజున జరగాల్సిన నాటకం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. చనిపోయిన విద్యార్థిని చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సుజయ్‌గౌడ్‌గా గుర్తించారు. నాగరాజ్, భాగ్యలక్ష్మిల కొడుకు సుజయ్. సుజయ్ తల్లిదండ్రులు చిత్రదుర్గలో టీ స్టాల్ నడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.

స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పాత్రలో సుజయ్ మంగళవారం నటించాల్సి ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అతను భగత్ సింగ్‌ను ఉరితీసిన భాగాన్ని రిహార్సల్ చేయాలనుకున్నాడు.. ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు తాడు వేలాడదీసి ఆ సన్నివేశాన్ని రిహార్సల్ చేసే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. తాడు మెడకు బిగుసుకుపోయింది. భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చేసరికి లోపల నుంచి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా సుజయ్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిత్రదుర్గ ఎక్స్‌టెన్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భగత్ సింగ్ పాత్ర కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సుజయ్ చనిపోయాడని అందరూ భావిస్తూ ఉన్నారని.. అందుకు సంబంధించిన విచారణ జరుగుతోందని చిత్రదుర్గకు చెందిన ఓ అధికారి చెప్పినట్లు తెలిసింది.


Tags:    

Similar News