విషాదం.. రైలులో తుపాకీతో కాల్చుకుని వ్యక్తి బలవన్మరణం
ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైలు నుంచి..;

west bengal to new delhi train
పశ్చిమబెంగాల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైలులో ప్రయాణికులు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిన బెంగాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడు జనరల్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఆ రైలు న్యూ జల్పైగురి స్టేషన్ కు సమీపంలోకి రాగానే ఆ ప్రయాణికుడు తనకు తానే తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. సోమవారం (ఏప్రిల్ 10) రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుడు ఆత్మహత్యకు ఉపయోగించిన గన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారులు వెల్లడించారు. మృతుడి వద్ద రైలు టికెట్ కూడా లేకపోవడంతో అతని ఏ స్టేషన్లో రైలు ఎక్కాడన్న విషయం కూడా తెలియరాలేదు. అతను ఎవరు ? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఘటన జరిగిన బోగీని న్యూ జల్పైగురి స్టేషన్ నుంచి వేరు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.