కాల్పుల కేసు... ఇంకా దొరకని క్లూస్
కాల్పుల కేసులో క్లూస్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కర్ణంగూడ పెట్రోలు బంకు వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో క్లూస్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కర్ణంగూడ పెట్రోలు బంకు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అనుమానాస్పదంగా ఉన్న రెండు స్కార్పియో వాహనాలను గుర్తించారు. కారులో దొరికిన రెండు బుల్లెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మృతి చెందని శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్కూటీపై వచ్చి.....
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మట్టారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో మట్టారెడ్డి నోరు విప్పడం లేదు. తమ మధ్య భూ వివాదాలు ఉన్నాయి, కానీ ఈ హత్యలతో తనక్ు సంబంధం లేదని చెబుతున్నాడు. నిందితులు స్కూటీపై వచ్చి కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి 24 గంటలు గడిచినా క్లూస్ లభించకపోవడంతో మృతుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.