సినీనటిపై దాడి కేసులో నిందితుడు అరెస్ట్
సినీనటి చౌరాసియా పై దాడి కసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.;
సినీనటి చౌరాసియా పై దాడి కసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కృష్టానగర్ కు చెందిన బాబుగా పోలీసులు గుర్తించారు. బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. గత ఆదివారం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కోసం వచ్చిన సినీనటి చౌరాసియాపై దాడి చేసి ఆమె సెల్ ఫోన్ లాక్కులని వెళ్లిన సంగతి తెలిసిందే.
కృష్ణానగర్ కు చెందిన.....
దీనిపై చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చౌరాసియా పై దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. చివరకు నిందితుడు బాబుగా తేల్చారు. దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.