Road Accident : ఒంగోలు సమీపంలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
సంక్రాంతి వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ కు ప్రమాదం జరిగింది;
సంక్రాంతి వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ కు ప్రమాదం జరిగింది. సింగరాయకొండలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో...
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బస్సును అక్కడి నుంచి తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.