Road Accident : అన్నవరం దర్శనానికి వెళుతూ కానరాని లోకాలకు.. ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు;

Update: 2025-01-11 06:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కత్తిపూడి వద్ద జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

ఏడుగురు ప్రయాణిస్తుండగా...

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరంతా భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.


Tags:    

Similar News