Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.;

Update: 2025-01-10 02:49 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. సూర్యాపేట జల్లా చివ్వెంల మండల ఐలాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, దాదాపు పదిహేను మంది వరకూ గాయాలపాలయ్యారు.

గాయపడిన వారిని...
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కూలీ పనుల నిమిత్తం ఒడిశా నుంచి హైదరాబాద్ కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో పాటు నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News