Big Breaking : మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదు గురు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Update: 2024-02-06 07:57 GMT
Big Breaking : మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని  ప్రమాదం.. ఐదు గురు మృతి
  • whatsapp icon

మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలభై మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని హర్థా పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. హర్ధాలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. టపాసుల తయారీలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. పేలుడు ధాటికి రోడ్డుపై బైకు పై వెళుతున్న ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

వంద ఇళ్లను ఖాళీ చేయించి...
చుట్టుపక్కల ఉన్న దాదాపు వంద ఇళ్లలో ఉన్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కార్లు, ద్విచక్రవాహనాలు కూడా పెద్దసంఖ్యలో దగ్దమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరుగతుంది. రెండు కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దం వినిపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News