రంజాన్ మాసంలో విషాదం : ఐదుగురి మృతి

రంజాన్ మాసంలో పాకిస్థాన్‌లో విషాదం నెలకొంది. ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేస్తున్న ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది.

Update: 2023-03-31 02:46 GMT

రంజాన్ మాసంలో పాకిస్థాన్‌లో విషాదం నెలకొంది. ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేస్తున్న ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఐదుగురు మరణించారు. పాకిస్థాన్‌లో గత కొద్దిరోజులుగా ద్రవ్యోల్బణం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి గోధుమ పిండి ధరలు 45 శాతం పెరిగాయి. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు.అయితే రంజాన్ మాసం కావడంతో పేదల కోసం గోధుమ పిండిని వివిధ కేంద్రాలు వద్ద ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

గోధుమ పిండి కేంద్రాల వద్ద...
అయితే ఈ కేంద్రాల వద్ద పెద్దయెత్తున ప్రజలు గుమి కూడటంతో తొక్కిసలాట జరిగింది. గోధుమ పిండిని ఉచితంగా సొంతం చేసుకోవాలని అనేక మంది ఈ కేంద్రాలకు తరలి రావడంతో తొక్కిసలాటలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు పంజాబ్‌లోని పంపిణీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. ఒక్కసారిగా జనం గోధుమ పిండి కోసం ఎగబడటంతోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు గోధుమ పిండి బస్తాలను ఎత్తుకెళ్లారు.


Tags:    

Similar News