శివమొగ్గ ఎడ్లరేసులో విషాదం.. ఇద్దరు మృతి
దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఎడ్ల రేసులు నిర్వహించేందుకు..;
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్లరేసులో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్లరేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామాల్లో ఈ ఘటనలు జరిగాయి. మృతులు షికారిపురకు చెందిన ప్రశాంత్, సొరబా తాలూకాలోని జాడే గ్రామానికి చెందిన ఆది గా గుర్తించారు. కాగా.. ఆ గ్రామాల్లో ఎడ్ల పందేలు నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. పైగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ప్రమాదం జరిగినట్లు సమాచారం.
దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ తెలిపారు. కాగా.. ఈ రెండు ఘటనలపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు.