నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం అదేనా ?
అస్వస్థతగా ఉన్న ఇద్దరు చిన్నారులకు ఓ నర్సు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పిల్లలకు ఇంజెక్షన్లు చేసిన..
హైదరాబాద్ : నగరంలో ఉన్న నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల మృతికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనంటూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకువస్తే.. ఏకంగా ప్రాణాలే తీసేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : టోలిచౌకిలో ఫ్లై ఓవర్ పై నుంచి పడి యువకుడు మృతి
అస్వస్థతగా ఉన్న ఇద్దరు చిన్నారులకు ఓ నర్సు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పిల్లలకు ఇంజెక్షన్లు చేసిన కొద్దిసేపటికే మరణించారని ఆరోపిస్తున్నారు. కాగా.. తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణలను నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఖండించారు. చిన్నారులను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికే వారి ఆరోగ్యం విషమించిందని, అనారోగ్యం కారణంగానే చిన్నారులు చనిపోయారని తెలిపారు. చిన్నారులు చనిపోవడానికి తమ నిర్లక్ష్యం కారణం అనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.