పసుపు ప్యాకెట్లలో గంజాయి.. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన!!

హైదరాబాద్ నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు

Update: 2024-09-09 11:08 GMT

హైదరాబాద్ నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్న పలువురిని అరెస్టు చేశారు. ధూల్‌పేటకు చెందిన నేహా బాయి అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయిని యువకులకు అమ్ముతూ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి దొరికిపోయింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ తిరుపతి యాదవ్‌, ఎస్‌ఐ నాగరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరికొత్త ప్యాకేజింగ్ స్టైల్ ను ఉపయోగించి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసారని ఎక్సైజ్ విభాగం తెలిపింది.


రెండు రోజుల కింద 20 కిలోల గంజాయి స్వాధీనం:
హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనుగుల, సుభాష్​ సీసా ఐదారేండ్లుగా అక్కడే గంజాయి పండిస్తూ ఇక్కడి దళారులకు అందించేవారు. స్వయంగా తామే అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఒడిశా నుంచి విశాఖపట్టణం మీదుగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News