దారుణం.. ఇద్దరు పిల్లకు విషమిచ్చిన తండ్రి... తాను కూడా?

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన తండ్రి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు;

Update: 2021-12-24 03:56 GMT
sucide, n yadagiri gutta, father and daughter, cherukuri suresh, sreshta
  • whatsapp icon

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన తండ్రి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా దామచరల్ల మండలం నూనావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూనావత్ తండాకు చెందిన కిషన్ నాయక్ వ్యవసాయం చేస్తుండే వాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. అయితే గత కొద్ది రోజులుగా కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. భార్యతో విభేదాలు చోటు చేసుకున్నాయి.

కుటుంబ కలహాలు.....
దీంతో కిషన్ నాయక్ తన ఇద్దరు కొడుకులు హర్షవర్థన్ (8), అఖిల్ (6) లకు విషమిచ్చాడు. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి మరణించారు. అనంతరం కిషన్ నాయక్ కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాలతోనే కిషన్ నాయక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News