ఈ నగరాలకు ఏమైంది..? కాపాడటం కష్టమేనా?

కరోనా వైరస్ దెబ్బకు నగరాలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా నగరాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే [more]

Update: 2020-06-23 18:29 GMT

కరోనా వైరస్ దెబ్బకు నగరాలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా నగరాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే ఎక్కువ శాతం కేసులు నగరాల్లోనే నమోదవుతున్నాయి. ఇందుకు కారణం జనసాంద్రత ఎక్కువగా ఉండటం, లాక్ డౌన్ మినహాయింపులతో జనం రోడ్లపైకి రావడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించక పోవడం వంటి కారణాలు కరోనా వ్యాప్తికి కారణాలుగా నిపుణులు గుర్తించారు.

పదిహేను నగరాల్లో…..

కరోనా వైరస్ మొత్తం పదిహేను నగరాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, పూనె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీలో కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

ఒక్క ముంబయిలోనే…..

ప్రధానంగా ముంబయి నగరం తీసుకుంటే ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా లక్ష కేసులు దాటితే అందులో సగం ముంబయి నగరంలోనే ఉన్నాయ. దాదాపు యాభై ఏడు వేల కేసుల వరకూ ముంబయి నగరంలోనే నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలోని పూనే నగరంలో దాదాపు పదకొండు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. అదే రాష్ట్రంలోని ఠాణే నగరంలోనూ కేసుల సంఖ్య పదహారు వేలు దాటింది.

చెన్నైలో కూడా….

ఇక చెన్నై నగరంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తమిళనాడులో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం చెన్నైలోనే ఉన్నాయి. దీంతో పళనిస్వామి ప్రతి ఇంటికి వైద్య బృందాలను పంపి కోవిడ్ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఢిల్లీలోనూ కేసుల సంఖ్య 40 వేలకు చేరువలో ఉండటం ఆందోళన కల్గిస్తుంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాతనే నగరాల్లో మరిన్ని కేసులు పెరుగుతున్నాయని సంబంధిత ముఖ్యమంత్రులు సయితం అంగీకరిస్తున్నారు. మొత్తం మీద నగరాలను కరోనా వదిలిపెట్టడం లేదు. అయితే నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరించకపోవడం ఒకింత ఊరట కల్గించే అంశం.

Tags:    

Similar News