తాళం తీశారు..గొళ్లెం సడలించారు

4.0 లాక్ డౌన్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ మే 31వ తేదీ వరకూ కొనసాగుతుంది. అయితే దాదాపు [more]

Update: 2020-05-17 18:29 GMT

4.0 లాక్ డౌన్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ మే 31వ తేదీ వరకూ కొనసాగుతుంది. అయితే దాదాపు అన్ని మినహాయింపులు ఇచ్చేసినట్లే. ఒక్క హాట్ స్పాట్ ప్రాంతాల్లోనే ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసులకు, మెట్రో సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అలాగే దేశ వ్యాప్తంగా రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది.

జనం ఎక్కువగా గుమిగూడే…..

జనం ఎక్కువగా గుమికూడే వంటి వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కళాశాలలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, బార్లు, ఆడిటోరియంలకు అనుమతి నిరాకరించింది. ఇక లాక్ డౌన్ నిబంధనలను అమలు చేసే బాధ్యత, సడలింపు అధికారాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే కట్టబెట్టింది. పెళ్లిళ్లకు యాభై మంది వరకూ అనుమతిచ్చింది. మరణాలకు ఇరవై మంది వరకూ అనుమతి ఇచ్చింది.

ప్రజా రవాణాను….

ఇక ప్రజా రవాణాను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రాష్ట్రాలు తమ పరిధిలో బస్సులను నడుపుకునే వెసులుబాటును కల్పించింది. అయితే భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలంటే మాత్రం పరస్పరం రెండు రాష్ట్రాలు చర్చించుకుని నడపాల్సి ఉంటుంది. దీంతో పాటు రాజకీయ సభలు, మతపరమైన కార్యక్రమాలపై కూడా మే 31వ తేదీ వరకూ నిషేధం కొనసాగుతుంది.

స్వల్ప ఊరట….

రెస్టారెంట్లకు స్వల్ప ఊరట లభించింది. రెస్టారెంట్లు ప్రారంభించుకోవచ్చని, అయితే హోం డెలివరీకి మాత్రమే అనుమతిని ఇచ్చింది. దీంతో కొంత రెస్టారెంట్లకు వెసులుబాటు కల్పించినట్లయింది. మొత్తం మీద రేపటి నుంచి అన్ని వ్యాపార కార్యక్రమాలు, ప్రజా రవాణా ప్రారంభమవుతుంది. మూడో విడత లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా మినహాయింపులు ఇచ్చేసినట్లే. అయితే భౌతిక దూరం, కరోనా నియంత్రణ చర్యలను వ్యాపారవర్గాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. మొత్తం మీద లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా సంఖ్య పెరుగుతుండటంతో కొన్నింటికి మినహా అన్నింటికి మినహాయింపులు ఇచ్చేసినట్లయింది.

Tags:    

Similar News