కాశ్మీర్ లో కొత్త చరిత్ర… ఇక వారందరూ?
సున్నితమైన, సరిహద్దు రాష్గ్రమైన జమ్ము – కాశ్మీర్ లో సరి కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. ఈ రాష్ట్రంలో ఏళ్ళతరబడి నివసిస్తున్నవారు ఇక నుంచి రాష్ట్రపౌరులుగా గుర్తింపు పొందనున్నారు. [more]
సున్నితమైన, సరిహద్దు రాష్గ్రమైన జమ్ము – కాశ్మీర్ లో సరి కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. ఈ రాష్ట్రంలో ఏళ్ళతరబడి నివసిస్తున్నవారు ఇక నుంచి రాష్ట్రపౌరులుగా గుర్తింపు పొందనున్నారు. [more]
సున్నితమైన, సరిహద్దు రాష్గ్రమైన జమ్ము – కాశ్మీర్ లో సరి కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. ఈ రాష్ట్రంలో ఏళ్ళతరబడి నివసిస్తున్నవారు ఇక నుంచి రాష్ట్రపౌరులుగా గుర్తింపు పొందనున్నారు. ఇప్పటి వరకు వివిధ పనులు చేసుకుంటుా ఇక్కడ నివసించినప్పటికి కాశ్మీర్ కు గల ప్రత్యేక ప్రతిపత్త కారణంగా వారు స్ధానికులు కాలేక పోయారు. ఫలితంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో అబ్ధి పొందలేక పోయారు. రాష్టేతరులుగానే మిగిలిపోయారు. నరేంద్రమెాదీ ప్రభుత్వం 2019 ఆగస్టు లో రాష్టానికి ప్రత్యేక ప్రతిపత్తని కల్పించి 370 అధికరణ తో పాటు దానికి అనుబంధంగాగ ల 35-ఎ అధికరణను రద్దు చేయడంతో జమ్ముకాశ్మీర్ ముఖచిత్రమే మారే పరిస్ధితి ఏర్పడింది. 370, 35-A అధికరణల కారణంగా ాకశ్మీరేతరులు ఎన్నేళ్ళుగా ఇక్కడ నివసించినప్పటికీ వారిని స్ధానికేతరులుగానే పరిగణిస్తారు. వారి పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు లభించవు. వారు స్ధానికంగా ఆస్తులు సమకూర్చుకోవడానికి అనర్హులు. ఈ పరిస్ధితి కారణంగా గత ఏడు దశాబ్బాలుగా కాశ్మీర్ సంక్షోభ కేంద్రంగా మారింది. ఈ పరిస్ధితిని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాద సంస్ధలు చలరేగి పోయాయి. పాక్ ప్రేరేపిత ఈ సంస్ధలు కాశ్మీరేతరులను ఊచకోత కోశాయి. ఫలితంగా వేలసంఖ్యలో కాశ్మీరీ పండితులు కాశ్మీర్ లోయలోని కొంపగోడు, ఆస్తులను వదులుకుని ఢిల్లీ, పంజాబ్, యుపీ, హర్యానా తదితర ప్రాంతాలకు వలస పోయారు. వారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కుాడా జరగలేదు.
నివాస గుర్తింపు పత్రాలు…..
తాజాగా 370, 35-ఎ అధికరణాల రద్దుతో సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ వర్గాల ప్రజలు స్ధానికులుగా అధికారికంగా గుర్తింపు పొందే అవకాశం ఏర్పడింది. కొత్తనిబంధనల ప్రకారం పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో నివసిస్తున్న వారు, పది, పన్నెండు తరగతులు చదివిన విధ్యార్ధులు రాష్ట్రనివాస గుర్తింపు పత్రాలు పొందేందుకు అర్హులు. ఒకసారి నివాస గుర్తింపు పొందిన వారు రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు, అమ్మకానికి అర్హులు. వారి పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్ధల్లో ప్రవేశాలు పొందేదుకు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులు అవుతారు. గతనెల 26న సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ చౌధురి రాష్ట్రనివాస ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. బీహార్ కు చెందిన చౌధురి జమ్ముకాశ్మీర్ కేడర్ ఐఏఎస్ అధికారిగా గత 24 సంవత్సరాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఈయన రాష్ట్ర నివాసిగా గుర్తింపు పొందిన తొలి పౌరుడు. తాజాగా గుర్ఖా రెజిమెంట్ కు చెందిన ఆరువేలమంది మాజీ సైనికులు నివాస ధ్రువీకరణ పత్రాలు పొందారు. వీరు దశాబ్ధాలుగా ఇక్కడనివసిస్తున్నారు. ఇప్పటిదాకా తాము పరాయివారిగా మిగిలిపోయామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కాశ్మీర్ రాజ్యసంరక్షణకు నేపాలీ సంతతికి చెందిన గుార్ఖాలను నాటి కాశ్మీరీ మహారాజు రప్పించారు. జమ్ముకు చెందిన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (రెవెన్యు) విజయ్ కుమార్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా……
కశ్మీర్ లోయలో 700 మంది మాజీ గూర్ఖా సైనికులకు నివాస ద్రువీకరణ పత్రాలు అందచేశారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా నివాస ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. స్ధానిక పారిశుధ్య కార్మికులు సమ్మెచేయడంతో 1957 లో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారిని పంజాబ్ నుంచి రప్పించారు. పశ్మిమ పాకిస్ధాన్ శరణార్ధులకు కూడా నివాస ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. దాదాపు లక్షమంది మాజీ గుర్ఖాసైనికులు రాష్ట్రంలో ఉన్నట్లు అంచనా. వీరు అన్ని ఎన్నికల్లో ఓట్లువేస్తున్నారు. కానీ స్ధిరాస్థిని సమకుార్చుకోలేకపోయారు. ఇప్పుడు తాము ఈ గడ్డపౌరులుగా మిగిలిపోతామని వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. నివాసధ్రువీకరణ పత్రాలు జారీని సహజంగానే ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్ వ్యతీరేకిస్తున్నాయి. ఇది జాతీయ పార్టీల కుట్ర అని ఆ పార్టీ అధినేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబుబా ముఫ్తీ ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ సమతుాకం దెబ్బతింటుందని హెచ్చరించాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఆచితుాచి స్పందిస్తున్నాయి. దీనివల్ల కాశ్మీరీలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండబోదని అవి భరోసా ఇస్తున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్