ఆ ఎమ్మెల్యే గారికి మంత్రి పీఠం ఖాయమట.. ప్రచారం పీక్స్ ?
గతంలో విశాఖ పట్నంలో వైసీపీ అధినేత జగన్‌ను ప్రత్యేక హోదా పోరు కోసం వెళ్లినప్పుడు పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో ఆయన పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు [more]
గతంలో విశాఖ పట్నంలో వైసీపీ అధినేత జగన్‌ను ప్రత్యేక హోదా పోరు కోసం వెళ్లినప్పుడు పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో ఆయన పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు [more]
గతంలో విశాఖ పట్నంలో వైసీపీ అధినేత జగన్‌ను ప్రత్యేక హోదా పోరు కోసం వెళ్లినప్పుడు పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో ఆయన పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. “కాబోయే సీఎం“ అంటూ.. కామెంట్లు చేయడం సంచలనం రేపింది. అప్పట్లో అధికార పక్షం నాయకులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అయితే.. ఇప్పుడు అచ్చు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. అయితే.. అప్పట్లో జగన్ స్వయంగా ఈ కామెంట్లు చేస్తే.. ఇప్పుడు.. సదరు ఎమ్మెల్యే మాత్రం.. తన అనుచరులతో చేయిస్తున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన….
బీసీ సామాజిక వర్గానికి చెందిన, కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే.. కొన్నాళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో సీఎం జగన్ పేదలకు, మధ్యతరగతి వారికి కూడా అనేక పథకాలు అందిస్తున్నారని.. సో.. ఆయననే బలపరచాలని.. లేకపోతే.. పథకాలు కూడా ఊడి పోతాయని వ్యాఖ్యానించి.. హైకోర్టు నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక, జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా.. నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. దేనికైనా సిద్దమే.. తన పేరు మాత్రం మీడియా హెడ్ లైన్స్‌లో కనిపించాలనే విధంగా వ్యవహరిస్తున్నారు.
కాబోయే మంత్రి అంటూ…?
ఇక, ఇప్పుడు సదరు ఎమ్మెల్యే గారి అనుచరులు చిత్రమైన విషయాన్ని తెరమీదికి తెచ్చారు. మాసార్ కాబోయే మంత్రి.. అంటూ.. బ్యానర్లు కడుతున్నారు. కొన్నాళ్ల కిందట దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన అభిమానులు.. 'భారతరత్న' అనే పదాన్ని.. పెద్దదిగా రాసి.. పక్క బ్రాకెట్‌లో కనిపించీ కనిపించని విధంగా “అర్హులు“ అని రాసినట్టుగా.. తాజాగా ఈ వైసీపీ ఎమ్మెల్యే విషయంలోనూ అభిమానులు, నియోజకవర్గం ప్రజలు.. ఇలానే వ్యవహరిస్తున్నారు.
ఇద్దరి మధ్య పోటీయే..?
మంత్రి అని రాసేసి.. బ్రాకెట్ 'కాబోయే' అని రాస్తున్నారట. అయితే.. ఇవి వివాదానికి దారితీయడంతో జిల్లా పార్టీలో కొందరు వైసీపీ పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయట. సదరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అభిమానులు, కార్యకర్తలే తొలగించడం గమనార్హం. మొత్తానికి .. ఇది ఎలా ఉన్నప్పటికీ.. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీ ఉండడంతో ఎవరికి మంత్రి పీఠం దక్కుతుందోనన్న చర్చ మాత్ర సాగుతుండడం గమనార్హం.