అక్కడ పొత్తుతోనే వెళ్లక తప్పదా?

ఇప్పటికే ఉత్తరాఖండ్ లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్ లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కువగా [more]

Update: 2020-09-03 18:29 GMT

ఇప్పటికే ఉత్తరాఖండ్ లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్ లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. జేడీయూ, బీజేపీ కూటమి పాలనను చూశారు. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ పాలనను చూసి ఎప్పుడో విసుగు చెందారు. దీంతో బీహార్ లో ప్రత్యామ్నాయం తామే అవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది.

పోస్టర్లతో తామున్నామని…..

అప్పుడే బీహార్ లో ఆమ్ ఆద్మీ పోస్టర్లు వెలిశాయి. బీహార్ ను ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు. జేడీయూ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి రాష్టాన్ని కాపాడాలంటూ పోస్టర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ ఒక్కరే బీహార్ ను అభివృద్ధి చేయగలరని బీహార్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అంగేషి సింగ్ చెబుతున్నారు. ఇప్పుడు పాలించిన పార్టీలన్నీ ప్రజల దృష్టిలో విలన్లుగా ఉన్నాయన్నారు. అందుకే తాము బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు.

పొత్తుతోనే వెళ్లాలని….

అయితే బీహార్ లో పొత్తుతో ముందుకు వెళ్లాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అభిప్రాయంగా ఉంది. బహుశా ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూటమితోనే ఆమ్ ఆద్మీ పార్టీ కలసి వెళ్లే అవకాశాలున్నాయన్నది విశ్లేషకులు అంచనాగా ఉంది. నిజానికి జేడీయూ ఒక్కటే పోటీ చేస్తే దానితో కలిసే అవకాశాలుండేవి. జేడీయూ బీజేపీతో కలవడంతో ఇక కాంగ్రెస్ కూటమితోనే వెళ్లాలన్నది బీహార్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అభిప్రాయం. ఈ మేరకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కూడా నివేదిక పంపినట్లు తెలుస్తోంది.

గతంలో పోటీ చేసి భంగపడి…..

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి, బలగం ఆమ్ ఆద్మీ పార్టీకి లేవన్నది వాస్తవం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నలభై స్థానాలకు గాను 39 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్కటీ దక్కించుకోలేదు. 2019 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లోనే పోటీ చేసింది. సీతామర్హి, భాగల్ పూర్, కిషన్ గంజ్ లో పోటీ చేసినా విజయం దక్కలేదు. దీంతో పొత్తుతోనే వెళితే మంచిదన్నది బీహార్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. మరి కేజ్రీవాల్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News