అలవికాని చోట ఎందుకు అరవింద్?

ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. కానీ అతి విశ్వాసం ఉండకూడదంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అతి విశ్వాసంలోనే ఉన్నట్లు కనపడుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం [more]

Update: 2020-02-18 17:30 GMT

ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. కానీ అతి విశ్వాసం ఉండకూడదంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అతి విశ్వాసంలోనే ఉన్నట్లు కనపడుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన తర్వాత ఇక తమ తిరుగులేదని భావించడంలో తప్పులేదు. అలాగే విస్తరించాలని భావించడంలో కూడా ఏమాత్రం నేరం కాదు. అయితే అలివిగాని చోట అధికులమనరాదన్న సామెతను ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుంచుకుంటే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు.

సంచలన విజయంతో….

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసింది నిజమే. బీజేపీని మట్టి కరిపించి మూడోసారి అధికారంలోకి రావడం ఆషామాషీ విషయం కాదు. ఇది అందరూ అంగీకరించే సత్యమే. మూడో సారి విజయం తర్వాత నిజంగా కేజ్రీవాల్ దేశంలో హీరో అయిపోయారు. ప్రధానంగా బీజేపీయేతర పార్టీలకు ఆయన ఒక నమూనాగా మారారు. కేజ్రీవాల్ తరహాలో పాలన చేయాలని ఇతర ముఖ్యమంత్రులు చూసే పరిస్థితిని తెప్పించుకున్నారు.

ఢిల్లీని చూసి…..

అయితే ఢిల్లీ అసెంబ్లీ పరిధి అనేది చాలా చిన్నది. కేవలం 70 స్థానాలు మాత్రమే ఉన్న ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలవడం ఆయన కష్టఫలితమే అయినా మిగిలిన రాష్ట్రాల సమస్యలతో పోల్చుకుంట ఇక్కడ చాలా తక్కువ. ఢిల్లీ ప్రజలు ఒక ప్రాంతానికి, మతానికి, కులానికి చెందిన వారు కాదు. మినీ ఇండియా. ఇక్కడ ఎటువంటి ప్రభావాలు పనిచేయవు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఎక్కువ పాలన సాగుతుంది. ఇలా ఉన్న ఢిల్లీలో విజయం సాధించిన కేజ్రీవాల్ దేశమంతటా పార్టీని విస్తరించాలని చూస్తున్నారు.

గతంలో చేదు అనుభవాలు….

ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కేజ్రీవాల్ తమ పార్టీని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల బరిలోకి దిగి చేతులు కాల్చుకున్న కేజ్రీవాల్ మరోసారి అదే తప్పు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఢిల్లీ విజయం చూపించిన ఉత్సాహంతో ఆలోచన చేయవచ్చేమో గాని వర్క్ అవుట్ అవ్వడం కష్టమంటున్నారు. మధ్యప్రదేశ్, గుజారాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతుంది. ఇదే జరిిగితే మరోసారి ఇతర ప్రాంతాల్లో కేజ్రీవాల్ కు భంగపాటు తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News