అచ్చెన్న కథ అడ్డం తిరిగినట్లేనా..?

చంద్రబాబుకు ఆయన సన్నిహితుడు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడ. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం పరిధిలో నిమ్మాడ ఉంది. దివంగత నేత [more]

Update: 2021-02-02 08:00 GMT

చంద్రబాబుకు ఆయన సన్నిహితుడు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడ. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం పరిధిలో నిమ్మాడ ఉంది. దివంగత నేత ఎర్రన్నాయుడు నుంచి అందరికీ జన్మనిచ్చిన గ్రామం. అక్కడ ఎపుడూ పంచాయతీకి ఎన్నికలు ఉండవు. ఆంతా నోటి మాట మీదనే సాగిపోతుంది. అచ్చెన్నాయుడు కుటుంబం పెత్తనమే అక్కడ సాగుతుంది. దాంతో షరా మామూలుగానే ఈసారి కూడా ఎన్నిక లేకుండా చూద్దామనుకుంటే కధ అడ్డం తిరిగింది.

భార్యామణితోనే …?

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పైగా మాజీ మంత్రి, అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడరు. ఇలా అన్ని రకాలుగా హోదాలలో తానుంటే తన సతీమణికి కూడా ఒక పదవి కావాలి కదా అని అచ్చెన్నాయుడు ఆమెను నిమ్మాడ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయించారు. ఆమెకు ఎవరూ ఎదురు లేకుండా రాకుండా చూసుకున్నారు. ఇక ఏకగ్రీవం ఖాయమని అనుకున్న నేపధ్యంలో వైసీపీ నుంచే గట్టి పోటీ తగిలింది. అదే కింజరాపు కుటుంబం నుంచే అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడు అప్పన్న వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన చేత నామినెషన్ వేయనీయకుండా ఎంత రచ్చ చేయాలో అంతా టీడీపీ నేతలు, అచ్చెన్నాయుడు చేసిన సంగతి తెలిసిందే.

డొల్లతనమేనా…?

చెప్పేందుకే నీతులు అన్నది ఒక సామెత. చంద్రబాబు ఏకాగ్రీవాలు వద్దు, ప్రజా తీర్పు అవసరం లేదా, ప్రజాస్వామ్యం వెల్లి విరియాల్సిన అవసరం లేదా అంటూ చాలా పెద్ద కబుర్లే చెప్పారు. ఇవన్నీ కూడా వైసీపీ మీద వేసిన రాజకీయ బాణాలే తప్ప అందులో నిబద్ధత ఎంతమాత్రం లేదని అచ్చెన్నాయుడు సొంత ఊర్లో అనుభవం చాటి చెప్పింది. నిమ్మాడలో ఏకగ్రీవానికి అచ్చెన్న వర్గీయులు ప్రత్యర్ధుల మీద సమరం చేస్తూంటే దానికి చంద్రబాబు సైతం వత్తాసు పలకడం ద్వారా ఏకగ్రీవాల మీద తన యూటర్న్ బయటపెట్టేసుకున్నారు. అంటే ఏకగ్రీవం జరిగితే అది టీడీపీ వారివే జరగాలన్న మాట.

కోట బద్దలేనా …?

ఉమ్మడి ఏపీలో అయినా విభజన ఏపీలో అయినా నిన్నటిదాకా నిమ్మాడ కధ సాఫీగా సాగింది. కానీ ఇపుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పైగా అచ్చెన్నాయుడిని ఓడించి తీరాలని జగన్ పట్టుబట్టి ఉన్నారు. టెక్కలి వైసీపీ ఇంచార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ని నియమించారు. ఆయనకే ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చేశారు. ఆ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్తే అక్కడి జనం బ్రహ్మరధమే పట్టారు. ఎపుడూ జనాలూ ఒకే నేతకూ నాయకుడికీ ఏళ్ళతరబడి కట్టుబడి దాసోహం అయిపోరుగా. ఆ ఆదరణ చూసుకునే ఈసారి దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా కింజరాపు కుటుంబం సభ్యుడి చేతనే సర్పంచ్ కి నామినేషన్ వేయించారు. ఇక్కడ కనుక వైసీపీ సర్పంచ్ గెలిస్తే మాత్రం నిమ్మాడ కధ వేరేగా ఉంటుంది అంటున్నారు. అంతే కాదు అచ్చెన్నాయుడు టెక్కలి కోటకు కూడా బీటలు వారడం ఖాయమని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News