achennaidu : అచ్చెన్న వార్నింగ్ కు అసలు అర్థముందా?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతలపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన క్యాడర్ [more]

Update: 2021-09-17 11:00 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతలపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన క్యాడర్ తో పాటు పరోక్షంగా కొందరు ముఖ్యనేతలకు సయితం వార్నింగ్ పంపారు. అయితే అచ్చెన్నాయుడు వార్నింగ్ పార్టీపై ఏ మేరకు పనిచేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరసగా పార్టీ నేతల్లో విభేదాలు తలెత్తుతుండటం పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.

బహిరంగ విమర్శలను…

ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును ఆయన టార్గెట్ చేశారు. కాల్వ శ్రీనివాసులు పెత్తనాన్ని తాము సహించబోమని చెప్పారు. క్యాడర్ ను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయింది. జేసీ వర్గానికి అనంతపురం పార్లమెంటు కమిటీలో చోటు ఇవ్వకుండా కట్టడి చేయాలని చూసింది.

వివాదాలకు చెక్ చెప్పకుండా?

ఇది జరిగిన వెంటనే అదే కాల్వ శ్రీనివాసులుపై బండారు శ్రీవాణి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఎస్సీ నియోజకవర్గంపై ఓసీల పెత్తనమేంటని వారు ప్రశ్నించారు. నిజానికి వీరు వెనక ఉన్నది కూడా అగ్రకుల నాయకత్వమే. ఇక్కడ విభేదాలకు మూలం ఏంటన్నది తెలుగుదేశం పార్టీ లోతుగా పరిశీలించడం లేదన్నది పార్టీ నేతల ఆరోపణ. కల్యాణదుర్గం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ రెండు గ్రూపులున్నా ఇప్పటి వరకూ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం తెలుగుదేశం నేతలు చేయడం లేదు.

అచ్చెన్నపై ఏం చర్యలు తీసుకోవాలి?

ఈ విభేదాలు కేవలం అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. మరి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఎవరికి ఇచ్చారు. ఆయన వార్నింగ్ ఇచ్చే అర్హత ఉందా? తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా లోకేష్ పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల మాటేమిటని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. పార్టీలేదు.. బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న తిరిగి ఆయనకే తగులుతుంది. సో.. అచ్చెన్న వార్నింగ్ లు ఉడత బెదిరింపులేనని పార్టీ క్యాడర్ లైట్ తీసుకుంటున్నాయి.

Tags:    

Similar News