ఆదినారాయణరెడ్డి పై ఆ అనుమానమా?

బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పై బీజేపీలో పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీలో కోవర్టుగా ఉన్నారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. [more]

Update: 2021-05-22 11:00 GMT

బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పై బీజేపీలో పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీలో కోవర్టుగా ఉన్నారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను, ఓటు బ్యాంకును టీడీపీకి తరలించడానికి ఆదినారాయణ రెడ్డి ప్రయత్నించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే దీనిపై ఎవరూ బహిరంగంగా విమర్శలు చేయకపోయినప్పటికీ ఇంటర్నల్ గా విచారణ ప్రారంభమయినట్లు చెబుతున్నారు.

పార్టీలు మారి…..

ఆదినారాయణరెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి గెలిచి తర్వాత టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తుందని భావించిన ఆదినారాయణరెడ్డి కాషాయ కండువాను కప్పుకున్నారు. రాయలసీమలోనూ తమకు బలమైన నేత కావాల్సి ఉండటంతో ఆయన చేరిక సులువయింది.

జమ్మలమడుగులోనే…

అయితే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగును విడిచిపెట్టే ఆలోచన లేదు. గత పంచాయతీ ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీ కంటే బీజేపీయే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. వీరంతా ఆదినారాయణరెడ్డి అనుచరులే. ఆయన ఏపార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళతారు. జమ్మలమడుగులో టీడీపీకి ఇప్పుడు దిక్కు ఎవరూ లేరు. తన చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీ ఇన్ ఛార్జి పోస్టు ఖాళీగానే ఉన్నట్లే.

వచ్చే ఎన్నికల నాటికి….

అందుకే వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరతారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే మాత్రం ఆయన బీజేపీలోనే కొనసాగుతారు. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ కోటాలో మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికీ ఆదినారాయణరెడ్డి టీడీపీ అగ్రనేతతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ కీలక బాధ్యతలను ఆదినారాయణరెడ్డికి అప్పగించినా ఆయన టీడీపీకి ఫేవర్ చేశారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి అంతర్గత విచారణలో ఏం తేలనుందో చూడాలి మరి

Tags:    

Similar News