అయితే ‘‘నాకేంటి‘‘..?

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆదినారాయణరెడ్డి మైండ్ గేమ్ లో సక్సెస్ అయ్యారన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విన్పిస్తున్న టాక్. మాజీ [more]

Update: 2019-09-06 13:30 GMT

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆదినారాయణరెడ్డి మైండ్ గేమ్ లో సక్సెస్ అయ్యారన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విన్పిస్తున్న టాక్. మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది.

మంత్రి పదవి కోసం…

నిజానికి ఆదినారాయణరెడ్డి తక్కువ నేత ఏమీ కాదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వరస విజయాలు సాధించిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వెళ్లారు. అప్పుడు కూడా పార్టీ మారాలంటే ‘నాకేంటిై’ అని ఆదినారాయణరెడ్డి టీడీపీ నేతలను ఊరించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో తాను అనుకున్నది సాధించాలనుకున్న ఆదినారాయణరెడ్డి కండువా మార్చేశారు. ఫలితం ఆదికి మంత్రి పదవి దక్కంది.

ఎంపీగా పోటీ చేయాలంటే…..

ఇక తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డికి అవకాశం ఇవ్వాలంటే ఎమ్మెల్సీ పదవి ఆయన వదులుకోవాల్సి ఉంటుందని ఆది షరతు పెట్టారు. దీంతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఆ పదవిని తన సోదరుడికి ఇప్పించుకున్నారు ఆదినారాయణరెడ్డి. ఇలా కుటుంబంలో ఒకరిని ఎమ్మెల్సీగా చేసుకున్నారు. ఇకతాను కడప ఎంపీగా పోటీ చేయాలంటే ఆర్థికంగా నిధులు అవసరం ఎక్కువగాఉంటుందని ముందుగానే మెలికపెట్టారు ఆదినారాయణరెడ్డి. ఈ మేరకు చంద్రబాబు నుంచి హామీ రావడంతో కడప ఎంపీబరిలో దిగారు.

మైండ్ గేమ్ లో భాగంగానే….

ఓడిపోతానని తెలిసినా పార్టీ కోసమే తాను పోటీచేస్తున్నట్లు సన్నిహితుల వద్ద ఆదినారాయణరెడ్డిచెప్పారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల నిధులు ఆదినారాయణరెడ్డికి చేరలేదు. అరకొరగా నిధులు అందడంతో ఆదినారాయణరెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అందుకే బీజేపీ లోకి వెళ్లేందుకు సిద్ధమయినట్లు వ్యవహరించారంటారు. జేపీనడ్డాను కలవడం,పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆదినారాయణరెడ్డి ఊహించినట్లుగానే చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో సమావేశమైన ఆదినారాయణరెడ్డి పెండింగ్ లో ఉన్న నిధులతోపాటు జగన్ ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని, తనకు పార్టీ రక్షణగా ఉండాలని కోరారు. దీనికి కూడాచంద్రబాబు అంగీకరించడంతో ఆదినారాయణరెడ్డి టీడీపీలోనే ఉండిపోయేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద ఆదినారాయణరెడ్డి మైండ్ గేమ్ ఇప్పుడు టీడీపీ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News