రైల్వేకు గ్రీన్ సిగ్నల్ … త్వరలో బస్సులు కూడా?

లాక్ డౌన్ తరువాత దేశవ్యాప్తంగా అన్ని రంగాలతోపాటు రైల్వే కూడా షట్ డౌన్ అయ్యింది. అయితే పెద్దఎత్తున నిత్యవసరాల రవాణాలో రైల్వే అద్భుత సేవలే అందించింది. ఈ [more]

Update: 2020-05-11 16:30 GMT

లాక్ డౌన్ తరువాత దేశవ్యాప్తంగా అన్ని రంగాలతోపాటు రైల్వే కూడా షట్ డౌన్ అయ్యింది. అయితే పెద్దఎత్తున నిత్యవసరాల రవాణాలో రైల్వే అద్భుత సేవలే అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రజారవాణా వ్యవస్థ పునరుద్ధరణకు ముందుకొచ్చింది కేంద్రం. ఈనెల 12 నుంచి కొన్ని రైళ్ళను సర్కార్ పట్టాలు ఎక్కిస్తుంది. ఐఆర్టీసి లో టికెట్స్ బుక్ చేసుకుని కరోనా లక్షణాలు లేని వారినే రైల్వే ప్రయాణానికి అనుమతి ఇవ్వనుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ లకు కన్ఫర్మ్ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.

ట్రయిల్ వేస్తున్నారా … ?

ప్రజా రవాణా వ్యవస్థ లో రైల్వే కీలకం. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్ రైళ్ళ పేరిట వారి గమ్యస్థానాలకు చేర్చడం మొదలు పెట్టింది రైల్వే శాఖ. ఇది విజయవంతంగా నడుస్తూ ఉండటంతో ఇక నెమ్మదిగా మరికొన్ని రైళ్లను ప్రారంభించి పరిస్థితి పరిశీలించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే 15 రైళ్లను ముందుగా నడిపి ఫలితాలను బట్టి సంఖ్య పెంచుతూ మొత్తం రైల్వే ఆపరేషన్స్ దశలవారీగా మొదలు పెట్టాయాలని కేంద్రం యోచిస్తోంది.

రైల్వేతో రోడ్డు…విమానాలు కూడా….

దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. రైల్వే గాడిన పడితే రాష్ట్రాల్లో బస్సులను నెమ్మదిగా రోడ్డెక్కించడానికి రంగం సిద్ధం అయిపోతుంది. విదేశాల్లో చిక్కున్నవారిని తరలించే ప్రక్రియ పూర్తి అయ్యాక డొమెస్టిక్ విమానాలను ఆరంభిస్తారని అంటున్నారు. అటు రైల్వే ఇటు రోడ్డు రవాణా, గగన తల ప్రయాణాలు మొదలైతే భారత్ లోని పౌరులు జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ తో సహజీవనం చేస్తూనే ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలతో పాటు శ్రమించాలిసి ఉంది.

Tags:    

Similar News