అక్బర్ ఇలా మారేడేమిటి?
అక్బరుద్దీన్.. ఎంఐఎం శాసనసభ పక్ష నేత. అంతేకాదు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి ఎరుగని నేత. తన ప్రసంగాలతో యువతను ఉర్రూతలూగించగలిగిన లీడర్. అక్బరుద్దీన్ [more]
అక్బరుద్దీన్.. ఎంఐఎం శాసనసభ పక్ష నేత. అంతేకాదు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి ఎరుగని నేత. తన ప్రసంగాలతో యువతను ఉర్రూతలూగించగలిగిన లీడర్. అక్బరుద్దీన్ [more]
అక్బరుద్దీన్.. ఎంఐఎం శాసనసభ పక్ష నేత. అంతేకాదు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి ఎరుగని నేత. తన ప్రసంగాలతో యువతను ఉర్రూతలూగించగలిగిన లీడర్. అక్బరుద్దీన్ ప్రసంగాలు వినేందుకు అర్ధరాత్రి దాటినా పాతబస్తీలో యువకులు వేచిచూస్తారంటే అతిశయోక్తి కాదేమో. మతం పైనే అక్బరుద్దీన్ ఇప్పటి వరకూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉన్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ మనసు మారిందనే అంటున్నారు.
ఆయన ప్రసంగాలకు…..
నిజానికి ఒవైసీ సోదరుల్లో కొంత సాఫ్ట్ గా ఉండేది అసదుద్దీన్ ఒవైసీ అంటారు. అసద్ పార్టీ అధినేతగా అందరినీ కలుపుకుంటూ సౌమ్యంగా ఉంటారన్నది పార్టీ వర్గాలు కూడా చెబుతుంటాయి. అదే అక్బరుద్దీన్ విషయానికి వచ్చే సరికి దూకుడు మనస్తత్వమని అంటారు. ప్రసంగాల్లోనూ, చేతల్లోనూ అక్బరుద్దీన్ ఫాస్ట్ కు అప్పుడప్పుడు అసద్ కూడా ఇబ్బంది పడుతుంటారంటారు. ఎన్నికల ప్రచార సమయంలో అయితే అక్బరుద్దీన్ ను పట్టుకునే వారుండరు.
దూకుడుగా ఉండే…..
తనకు పదిహేను నిమిషాలు సమయమిస్తే హిందువులను ఖతం చేస్తానని అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక నిజామాబాద్ లో కూడా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాంటి అక్బరుద్దీన్ లో ఒక్కసారి మార్పు వచ్చింది. పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళీ దేవాలయం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరడమే ఇందుకు కారణం. హిందూ ఓటు బ్యాంకు పై అక్బర్ కన్ను పడిందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
కేసీఆర్ ను కలసి…..
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను అక్బరుద్దీన్ కలిశారు. పాతబస్తీలో ఉన్న అనేక సమస్యల గురించి ప్రస్తావించకండా లాల్ దర్వాజా మహంకాళీ దేవాలయం గురించి ప్రస్తావించడం అందరికీ ఆశ్చర్యమే కలిగించింది. దీనిపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. పదికోట్లు నిధులు అడిగిన అక్బరుద్దీన్ గతంలో చేసిన హిందూ వ్యతిరేక కామెంట్స్ ను బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ విషయంలో హిందువుల క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అక్బరుద్దీన్ రూటు మార్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.