అఖిల స్కెచ్ అనుకున్నది అనుకున్నట్లుగానే…?
భూమా కుటుంబం మధ్య విభేదాలు గట్టిగానే వచ్చినట్లున్నాయి. భూమా అఖిలప్రియ కేవలం ఆళ్లగడ్డపైనే దృష్టి పెట్టారు. నంద్యాల విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో తన [more]
భూమా కుటుంబం మధ్య విభేదాలు గట్టిగానే వచ్చినట్లున్నాయి. భూమా అఖిలప్రియ కేవలం ఆళ్లగడ్డపైనే దృష్టి పెట్టారు. నంద్యాల విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో తన [more]
భూమా కుటుంబం మధ్య విభేదాలు గట్టిగానే వచ్చినట్లున్నాయి. భూమా అఖిలప్రియ కేవలం ఆళ్లగడ్డపైనే దృష్టి పెట్టారు. నంద్యాల విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని బరిలోకి దించాలన్న కారణంగా కావాలనే అఖిలప్రియ నంద్యాలను పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం పంచాయతీ ఎన్నికల్లో రుజువయింది. భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో బద్నాం చేయడానికే అఖిలప్రియ నంద్యాలను తాత్కాలికంగా వదిలేశారంటున్నారు.
రెండు నియోజకవర్గాల్లో…..
భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నప్పుడు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పట్టుంది. భూమా దంపతులు ఇద్దరూ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. నంద్యాల అంటేనే నాగిరెడ్డి అనే పేరుంది. అలాంటి నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత క్యాడర్ చెల్లా చెదురయింది. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండటం, మంత్రులందరూ అక్కడే కూర్చోవడంతో విజయం దక్కింది.
ఏవీ దూరం కావడంతో….
అయితే 2019 ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. దీనికి అనేక కారణాలున్నాయి. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం చేసుకున్నారు. ఆస్తుల విషయంలో తలెత్తిన అభిప్రాయ బేధాలు రాజకీయంగా కూడా విస్తరించాయి. ఏవీ సుబ్బారెడ్డిని హత మార్చేందుకు అఖిలప్రియ కుట్రపన్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు.
నాగిరెడ్డి వారసుడిగా…..
మరోవైపు భూమా బ్రహ్మానందరెడ్డి మామ బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కావడంతో ఆయన కొంత దూకుడు తగ్గించారు. దీంతో పాటు అఖిలప్రియ తన సోదరుడిని ఈసారి నంద్యాల నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. నాగిరెడ్డి వారసుడిగా జగత్ విఖ్యాతరెడ్డిని నంద్యాల ప్రజలు ఆదరిస్తారని అఖిలప్రియ ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. బ్రహ్మానందరెడ్డిని సైడ్ చేసేందుకే అఖిలప్రియ పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అఖిలప్రియ ప్లాన్ ప్రకారమే నంద్యాల విషయంలో అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.