అఖిలేష్ పెడల్ పై కాలుపెట్టారట
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. కేంద్ర స్థాయిలో జరిగే పరిణామాలను సయితం తమకు అనుకూలంగా [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. కేంద్ర స్థాయిలో జరిగే పరిణామాలను సయితం తమకు అనుకూలంగా [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. కేంద్ర స్థాయిలో జరిగే పరిణామాలను సయితం తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు అన్ని పార్టీలూ ప్రారంభించాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఇప్పుడే ఎన్నికలకు సిద్ధమయినట్లు కన్పిస్తుంది. ఆయన త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారని చెబుతారు.
అందరూ ఒంటరిగానే…?
ఈసారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలూ ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్దమయినట్లు కనపడుతుంది. అఖిలేష్ యాదవ్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు మాయావతి సయితం తమ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ కూడా చిన్నా చితకా పార్టీలతో కలసి ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లనుంది.
కుటుంబంలో విభేదాలను….
ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ముందుగా కుటుంబంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. బాబాయి శివపాల్ యాదవ్ వేరుకుంపటి పెట్టుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో కొంత ఇబ్బంది తలెత్తింది. పార్టీ క్యాడర్ కూడా అనేక నియోజకవర్గాల్లో అయోమయంలో ఉంది. ప్రధానంగా యాదవ సామాజికవర్గం చీలిపోయిన తరుణంలో బాబాయితో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనతో…
మరోవైపు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. గత నాలుగేళ్లుగా ఉత్తర్ ప్రదేశ్ లో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను ఎండగడుతూ అఖిలేష్ యాదవ్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగానే నియోజకవర్గాల్లో రెండు వర్గాలుగా విడిపోయిన గ్రూపులను ఆయన ఏకం చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ అందరికంటే ముందుగానే ప్రజల్లోకి వెళ్లి రాజకీయంగా వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మరి సైకిల్ పరుగులు తీస్తుందో? లేదో? చూడాలి.