సైకిల్ ఈసారి పరుగులు తీస్తుందా?

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత [more]

Update: 2021-08-14 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. 2012 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవ్వాలన్న లక్ష్యంతో అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈసారి విజయం తనదేనన్న ధీమాను అఖిలేష్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది….?

వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 403 స్థానాలున్న ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించేందుకు అఖిలేష్ యాదవ్ శ్రమిస్తున్నారు. పార్టీలో ఉన్న విభేదాలను క్రమంగా తొలగించుకుంటూ వెళుతూ మరోవైపు క్యాడర్ ను ఉత్తేజ పర్చేందుకు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పొత్తులు పెట్టుకున్నా….

గతంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం కన్పించకపోవడంతో అఖిలేష్ యాదవ్ ఈసారి చిన్నా చితకా పార్టీలను మాత్రం కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. 2017లో జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 202 కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు అఖిలేష్ యాదవ్ నడుంబిగించారు. బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికలోనూ….

కాంగ్రెస్ తో కలసి గత ఎన్నికల్లో చతికల పడిన అఖిలేష్ యాదవ్ ఈసారి ఆ తప్పు చేయదలచుకోలేదు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తూ ఇప్పటి నుంచే అఖిలేష్ యాదవ్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మాయావతి పార్టీ ఎఫెక్ట్ తమ పై పడకుండా ఈసారి అఖిలేష్ యాదవ్ అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఉత్తర్ ప్రదేశ్ లో ఈసారి సైకిల్ పరుగులు తీస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News