akhilesh : యాదవ్ భయ్యా.. ఇదే ఆఖరి ఛాన్స్ అట
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రధాన పోటీ [more]
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రధాన పోటీ [more]
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీకి మధ్యనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష కాబోతున్నాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వానికి సమస్య గా మారనుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ములాయం పార్టీని….
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ ప్రధానం. ఆయన సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకురాగలిగారు. జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. కులాల పట్టు ఇక్కడ ఉన్నప్పటికీ ములాయం సింగ్ యాదవ్ అన్ని కులాలను ఆకట్టుకుని పార్టీని విజయపథాన నడిపారు. 2012 లో జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.
క్యాడర్ లో నైరాశ్యం…
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల పాటు పార్టీని పట్టించుకోలేదన్న విమర్శలు న్నాయి. ఈ నేపథ్యంలో 2017 లోజరిగిన ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ పరాజయం పాలయింది. పరాజయం పాలయిన వెంటనే పార్టీలో పెద్దయెత్తున అసంతృప్తి మొదలయింది. సొంత బాబాయి శివపాల్ యాదవ్ వేరుకుంపటి పెట్టుకున్నారు. ములాయం తో సహా అందరినీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ తప్పించారు. పార్టీ క్యాడర్ లో కూడా పూర్తిగా నిరాశ అలుముకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఈసారి గెలవకపోతే…?
దీంతో ఈసారి అఖిలేష్ యాదవ్ పార్టీని గెలిపించుకోలేకపోతే అక్కడ కాంగ్రెస్ మరింత బలపడే అవకాశముంది. ఇందుకోసం అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మాయావతి పార్టీకి రోజులు లేవని నమ్ముతున్నారు. అందుకోసమే అఖిలేష్ యాదవ్ టార్గెట్ ఇప్పుడు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా. అందుకే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అఖిలేష్ నాయకత్వంపై ఈఎన్నిక అటో ఇటో తేలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.