అఖిలేష్ టార్గెట్ బీజేపీ కాదట?

అఖిలేష్ యాదవ్ స్పీడ్ పెంచారు. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయి. కరోనా సమయంలోనూ అధికార బీజేపీపై అఖిలేష్ యాదవ్ మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటమే ఇందుకు కారణమని [more]

Update: 2020-05-09 17:30 GMT

అఖిలేష్ యాదవ్ స్పీడ్ పెంచారు. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయి. కరోనా సమయంలోనూ అధికార బీజేపీపై అఖిలేష్ యాదవ్ మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటమే ఇందుకు కారణమని చెప్పుక తప్పదు. కరోనా నియంత్రణలో యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం విఫలమయిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అంతేకాదు ఆయన ఆర్ఎస్ఎస్ పైనా విరుచుకుపడ్డారు.

ఆర్ఎస్ఎస్ ను తొలుత….

బీజేపీ కంటే తొలుత అఖిలేష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. తన ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది పరోక్షంగా ఆర్ఎస్ఎస్ అని అఖిలేష్ యాదవ్ గట్టిగా నమ్ముతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంది. గ్రామస్థాయి స్థితిగతులను ఎప్పటికప్పుడు బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ తెలియజేసింది.

గత ఎన్నికల్లో…..

అందుకే గత ఎన్నికల్లో తాము దారుణంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందని అఖిలేష్ యాదవ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే అఖిలేష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేశారు. కరోనా సమయంలో లాక్ డౌన్ నిబంధనలను ఆర్ఎస్ఎస్ యధేచ్ఛగా ఉల్లంఘిస్తుందని అఖిలేష్ మండిపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలను సంఘ్ పరివార్ తనది గా చెప్పుకుంటుందన్నారు.

ముందు మూలాల మీద….

కేవలం బీజేపీకి అనుకూలమైన వారికే సాయం అందుతుందని కూడా అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ అజెండా అమలవుతుందని, లాక్ డౌన్ సమయంలో సమావేశాలు ఆర్ఎస్ఎస్ ఎలా నిర్వహిస్తుందని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ ను తొలుత టార్గెట్ చేస్తే తప్ప యూపీలో బీజేపీ హవాను కంట్రోల్ చేయలేమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అఖిలేష్ యాదవ్ మాత్రం ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News