జనసేన రాజమండ్రి ఎంపి టికెట్ ఆయనకే …?

జనసేన పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ జోరు పెంచింది. ఈ కమిటీల్లో వుండే వారిలో ఒకరు ఎంపి టికెట్ ఆశించే వారు కావడం గమనార్హం. రాజమండ్రివరకు వస్తే ఎమ్యెల్యే [more]

Update: 2019-02-09 04:30 GMT

జనసేన పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ జోరు పెంచింది. ఈ కమిటీల్లో వుండే వారిలో ఒకరు ఎంపి టికెట్ ఆశించే వారు కావడం గమనార్హం. రాజమండ్రివరకు వస్తే ఎమ్యెల్యే గా బిజెపి నుంచి గెలిచి ఇటీవల పదవికి పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ. ఆయన్ను రాజమండ్రి పార్లమెంటరీ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు జనసేనాని. ఆర్ధిక అంగ బలాలు సమృద్ధిగా ఉండటంతో పాటు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన డాక్టర్ సత్యనారాయణను దాదాపు ఎంపి టికెట్ కి జనసేన టిక్ పెట్టినట్లేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈక్వేషన్స్ కలిసొచ్చాయి ….

అధికారపార్టీ సిట్టింగ్ ఎంపి గా రాజమండ్రి నుంచి సినీనటుడు మురళి మోహన్ వున్నారు. ప్రధాన విపక్షం బిసి సామాజిక వర్గం నుంచి మార్గాన్ని భరత్ కి దాదాపు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటరీ నియోజక వర్గంలో మరో బలమైన సామాజికవర్గంగా కాపులు ఉన్నారు. దాంతో జనసేన కు మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలిసిన అవసరం కూడా లేకుండా పోయింది. డాక్టర్ ఆకుల అయితేనె ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు బలమైన పోటీ ఇస్తారన్న అంచనా సామాజిక వర్గాల ఈక్వేషన్స్ తో రాజమండ్రికి దాదాపు ఆకులే అభ్యర్థిగా జనసేన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

స్పీడ్ పెంచిన ఆకుల …

బిజెపి నుంచి జనసేన లో చేరినప్పటినుంచి డాక్టర్ ఆకుల సత్యనారాయణ జోరు పెంచారు. పార్టీలో వివిధ వర్గాల వారిని చేర్చుకోవడం తమ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ర్యాలీలు, సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోఅందరితో వున్న సంబంధాలు ఆయనకు కలిసి వస్తున్నాయి. దీనికి తోడు రాజమండ్రి, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో బంధు వర్గం బలంగా ఉండటంతో జనసేన ను జనంలోకి వేగంగా తీసుకుపోతున్నారు డాక్టర్ ఆకుల. సమీప దూరంలో జనసేన నుంచి రాజమండ్రి పార్లమెంటరీ టికెట్ ఆశిస్తున్న వారు కూడా లేకపోవడం కూడా ఆకులకు కలిసి వస్తున్న అంశం. దాంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే కింది స్థాయిలో పార్టీ పటిష్టం పై దృష్టి పెట్టి సాగిపోతున్నారు డాక్టర్. మరి జనసేనాని నిర్ణయం ఎలా వుండబోతుందో చూడాలి.

Tags:    

Similar News