జనసేనకు ఆయన బై చెప్పేసినట్లే…!!?

రాజమండ్రి మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ జనసేనకు దాదాపు గుడ్ బై కొట్టేసినట్లే అని తేలిపోయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలోని [more]

Update: 2019-08-06 00:30 GMT

రాజమండ్రి మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ జనసేనకు దాదాపు గుడ్ బై కొట్టేసినట్లే అని తేలిపోయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాల సమీక్షకు డాక్టర్ ఆకుల సత్యనారాయణ హాజరుకాలేదు. గత ఎన్నికలకు ముందు బిజెపి పార్టీకి, తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి డాక్టర్ ఆకుల సత్యనారాయణ పవన్ సమక్షంలో భార్యా సమేతంగా జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. డబ్బు పలుకుబడి మెండుగా ఉండటంతో ఆయన కోరుకున్న రాజమండ్రి పార్లమెంట్ స్థానం కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. అయితే తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరికి ఎమ్యెల్యే టికెట్లు డాక్టర్ ఆకుల సత్యనారాయణ కోరడం పవన్ నిరాకరించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ఈ లుకలుకలు, అలకలు పాలపొంగులా మిగిలిపోయాయి.

జనసేన యాక్టివిటీ లేకపోవడంతో …

ఎన్నికల్లో జనసేన ఘోరంగా దెబ్బతింది. వైసిపి సునామీ లో కొట్టుకుపోయిన స్థానాల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం కూడా ఒకటి. అటు టిడిపి ఇటు జనసేన అభ్యర్థులకు చేదు అనుభవాలే మిగిలాయి. ఫలితాలు వచ్చిన తరువాత డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనపై ఘాటుగా స్పందించారు. తప్పంతా పవన్ నాయకత్వ లేమి సమన్వయ లేమి, పార్టీకి కులముద్ర ఓటమికి ప్రధాన కారణాలని తేల్చేశారు.

బీజేపీలో చేరతారా?

ఇక జనసేన యాక్టివిటీస్ కి ఎందుకు దూరంగా వున్నారని ప్రశ్నిస్తే అసలు పార్టీ కార్యక్రమాలు లేవంటూ ఎదురు ప్రశ్నించి ఆ పార్టీని వీడే సంకేతాలు ఇచ్చేశారు ఆకుల సత్యనారాయణ . బిజెపి నుంచి వచ్చిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ తొలుత కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ప్రజారాజ్యం తిరిగి కాంగ్రెస్ ఆ తరువాత బిజెపి లో చేరి చివరికి జనసేన ను ఎన్నికల ముందు ఆశ్రయించారు. తాజాగా జనసేన అధినేత ఏర్పాటు చేసిన కీలక సమీక్షకు డుమ్మా కొట్టడం ద్వారా పవన్ పార్టీ కి ఆయన రాం రాం చెప్పేయడం ఇక లాంఛనం గా స్పష్టం అయ్యింది.

Tags:    

Similar News