ఆళగిరి ప్రభావం ఏమీ ఉండదా?

తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరి దృష్టి ఆళగిరి పైనే ఉంది. కరుణానిధి కుమారుడు కావడంతో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆళగిరిని డీఎంకే [more]

Update: 2021-04-01 17:30 GMT

తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరి దృష్టి ఆళగిరి పైనే ఉంది. కరుణానిధి కుమారుడు కావడంతో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆళగిరిని డీఎంకే పార్టీలో చేర్చుకోలేదు. ఆళగిరి కూడా డీఎంకే కు దూరంగానే ఉన్నారు. కొంతకాలం సొంత పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. మరికొంత కాలం ఆళగిరి రజనీకాంత్ పార్టీలో చేరతారన్న వదంతులు వచ్చాయి.

రజనీ పార్టీలో చేరాలనుకున్నా….

అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష‌్టం చేయడంతో ఆళగిరి సొంత పార్టీ వైపు మొగ్గుచూపుతారనుకున్నారు. రజనీకాంత్ర ప్రకటన వచ్చిన తర్వాత ఆళగిరి బీజేపీలో చేరతారనుకున్నారు. కానీ తన తండ్రి కరుణానిధి వ్యతిరేకించిన అన్నాడీఎంకే కూటమిలో బీజపీ ఉండటంతో ఆళగిరి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తన అనుచరులతో సమావేశమైన ఆళగిరి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

సొంత పార్టీ పెట్టాలని…..

కానీ తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. కలైంజర్ డీఎంకే పార్టీ పెడతారని పెద్దయెత్తున ఆళగిరి అభిమానులు, అనుచరులు పోస్టర్లు కూడా వేశారు. ఆళగిరి డీఎంకే లోకి రావాలని బలంగా విశ్వసించారు. తన తండ్రి మరణానంతరం పార్టీలో కీలక భూమి పోషించాలనుకున్నారు. అందుకే తన మద్దతుదారులతో అప్పట్లో చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ ఆళగిరి ప్రయతనాలు ఏవీ వర్క్ అవుట్ కాలేదు.

కానీ రాష్ట్ర వ్యాప్తంగా…

ఆళగిరి సొంత పార్టీ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే పరిస్థితుల్లో లేరు. కేవలం మధురై ప్రాంతానికి మాత్రమే ఆళగిరి పరిమితమయి ఉన్నారు. కరుణానిధి జీవించి ఉన్నప్పుడు, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆళగిరి మధురైనే తన అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేశారు. అదే ఇప్పుడు ఆళగిరికి ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఆళగిరి ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు.

Tags:    

Similar News