ఆళగిరికి ఆ మాత్రం తెలియదా?

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో బలం ఉందా? లేదా? ప్రభావం ఏ మేరకు చూపుతారన్నది పక్కన పెడితే ప్రధాన రాజకీయ పార్టీలకు మాత్రం [more]

Update: 2021-01-01 18:29 GMT

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో బలం ఉందా? లేదా? ప్రభావం ఏ మేరకు చూపుతారన్నది పక్కన పెడితే ప్రధాన రాజకీయ పార్టీలకు మాత్రం చికాకు కల్గించే విధంగా సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ తన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసింది. ఆయన కూటమిని కూడా ఏర్పాటు చేస్తారంటున్నారు. దీంతో మరికొందరు కూడా కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.

కొత్త పార్టీతో ప్రజల ముందుకు…..

కరుణానిధి కుమారుడు ఆళగిరి సయితం కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నారు. వేరే పార్టీలో చేరడం కంటే కొత్త పార్టీ పెట్టి కనీస స్థానాలను దక్కించుకున్నా ప్రాధాన్యత ఉంటుందని ఆళగిరి భావిస్తున్నారు. డీఎంకే నుంచి బహిష్కరించిన ఆళగిరి తిరిగి ఆ పార్టీలో చేరేందుకు చేయని ప్రయత్నాలు లేవు. అయితే ఆళగిరి చేరికను స్టాలిన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆళగిరి కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు.

బీజేపీకి దూరంగా…..

ఈ నేపథ్యంలో ఆళగిరి కొత్త పార్టీ పెడతారని చెబుతున్నారు. తొలుత ఆళగిరి బీజేపీలో చేరుతారని భావించారు. బీజేపీ పెద్దలు కూడా ఆయనతో సమాలోచనలు జరిపారు. అయితే బీజేపీతో కలిస్తే తన తండ్రి ఆశయాలను నీరుగార్చినట్లవుతుందని భావించిన ఆళగిరి ఆ ప్రయత్నం మానుకున్నారు. చెన్నై కి వచ్చని అమిత్ షాను కూడా ఆళగిరి కలవలేదు. దీంతో జనవరి 3వ తేదీన తన అనుచరులతో సమావేశమై కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

రజనీతో కలసి……

అయితే ఆళగిరి ఇప్పటికే డిసైడ్ అయ్యారు. రజనీకాంత్ తో కలసి ఆళగిరి ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రజనీకాంత్ పార్టీ తో కలసి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. కొత్త పార్టీ కావడం, డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం రజనీకాంత్ పార్టీయే కావడం అనుకూలిస్తుందని ఆళగిరి అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ పార్టీ అధికారంలోకి వస్తే తాను కీలక భూమిక పోషించ వచ్చని కూడా ఆయన యోచిస్తున్నారు. అందుకే ఆళగిరి రజనీకాంత్ పార్టీతో కలసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News