అయినా పసిడి పరుగులు ఎందుకు ?
కరోనా మహమ్మారి విజృంభణకు అన్ని రంగాలు కుదేలు అయిపోయాయి. కానీ ఒకే ఒక్క రంగం లో ధరలు చుక్కలు చూస్తూ దూసుకుపోతున్నాయి. అవే బంగారం వెండి ధరలు [more]
కరోనా మహమ్మారి విజృంభణకు అన్ని రంగాలు కుదేలు అయిపోయాయి. కానీ ఒకే ఒక్క రంగం లో ధరలు చుక్కలు చూస్తూ దూసుకుపోతున్నాయి. అవే బంగారం వెండి ధరలు [more]
కరోనా మహమ్మారి విజృంభణకు అన్ని రంగాలు కుదేలు అయిపోయాయి. కానీ ఒకే ఒక్క రంగం లో ధరలు చుక్కలు చూస్తూ దూసుకుపోతున్నాయి. అవే బంగారం వెండి ధరలు కావడం చర్చనీయాంశం అవుతుంది. మార్కెట్లో పరిశీలిస్తే అటు బంగారం, వెండి షాపులు కస్టమర్లు లేక వెలవెలపోతూనే ఉన్నాయి. అయినా కానీ పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
కారణాలు ఏంటి …?
భారత్ లో శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్ లో బంగారం కొనుగోళ్ళు భారీగానే ఉంటాయి. అయితే సీజన్ మొదలైనా షాపు లు దేశంలో వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ ల కారణంగా పూర్తి సమయం తెరుచుకోవడం లేదు. తెరుచుకున్నా కొనేవారు లేరు. అయితే బంగారం డాలర్ మారకం రేట్ తో పోటీ పడటం అనాదిగా వస్తుంది. ఇప్పుడు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పోతున్నాయి.
సామాన్యుడు కొనలేని స్థాయికి …
ప్రస్తుతం బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 53 వేల రూపాయలకు చేరువగా వచ్చేసింది. అదే రీతిలో వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం కిలో వెండి 62 వేలరూపాయలకు చేరుకుంది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు కోసం బంగారం వెండి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులకు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఈ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నమ్మకమైన పెట్టుబడికి బంగారం, వెండి సరైనవని కూడా అంతా భావించడం కూడా వీటి ధరల పెరుగుదల కు రీజన్స్ అంటున్నారు.