ఇరవై మూడు… మూడేదెవరికి…??

సమయం దగ్గరపడుతోంది. పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్క పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన [more]

Update: 2019-05-22 18:29 GMT

సమయం దగ్గరపడుతోంది. పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్క పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కన్నడ నాట ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో మిగిలిపోయాయి. ఎవరికీ అవతలి వారిపై నమ్మకం లేదు. సంకీర్ణంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు జనతాదళ్ ఎస్ అంటే గౌరవం లేదు. అలాగే జనతాదళ్ ఎస్ కు కాంగ్రెస్ మీద అమమానపు సెగలే. వీటి మధ్య ప్రధాన పార్టీలన్నీ భవిష్యత్ కార్యాచరణపైనే దృష్టి పెడుతున్నాయి.

యడ్యూరప్ప సన్నాహాలు…

మే 23వ తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ బెంగళూరు దాటి వెళ్ల కూడదని ఆదేశాలు జారీచేశారు. ఈనెల 21వ తేదీ నుంచి బెంగళూరులోనే పార్టీకి అందుబాటులో ఉండాలని కోరారు. ఎప్పుడైనా సమావేశం ఉంటుందని చెప్పారు. విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నా వాటిని రద్దు చేసుకోవాలని కూడా కోరారు. 104 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప ఎన్నికల ఫలితాల రోజే సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విశ్వాస పరీక్ష కోసం…

ఒకవేళ కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే తమతో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామాచేయించి, సంకీర్ణ సర్కార్ బలం తగ్గించాలన్నది యడ్యూరప్ప వ్యూహంగా ఉంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రంగంలోకి దిగనున్నారు. మరోసారి విశ్వాస పరీక్షను కుమారస్వామి ఎదుర్కొనాల్సి ఉంటుందని బీజేపీ బహిరంగంగానే చెబుతోంది. బలపరీక్ష కోసం గవర్నర్ వద్దకు యడ్యూరప్ప వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు? ఏ ప్రాంత ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న చర్చ కన్నడ నాట జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్,కుమారస్వామి కూడా….

దీంతోకాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 21 నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని కోరింది. మాజీ మంత్రి సిద్ధరామయ్య సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 78 ఎమ్మెల్యేలు ఎవరు చేజారి పోకుండా హస్తం పార్టీ నేతలు రంగంలోకి దిగారు. వారితో నిత్యం ఫోన్ లో టచ్ ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి సయితం తన తండ్రి దేవెగౌడతో వ్యూహరచనలో మునిగిపోయారు. బలపరీక్షను ఎదుర్కొనాలంటే ఏం చేయాలన్నదానిపై వారు చర్చించారు. మొత్తం మీద కన్నడనాట 23వ తేదీ టెన్షన్ అన్ని పార్టీల్లోనూ నెలకొని ఉంది.

Tags:    

Similar News