Alla : ఆళ్ల ను పక్కన పెట్టడానికి కారణాలివేనట

ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కడం కష్టంగానే కన్పిస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయనకు సామాజిక సమీకరణాల కారణంటా మంత్రివర్గంలో ఛాన్స్ [more]

Update: 2021-11-06 02:00 GMT

ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కడం కష్టంగానే కన్పిస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయనకు సామాజిక సమీకరణాల కారణంటా మంత్రివర్గంలో ఛాన్స్ లభించదంటున్నారు. అసలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానికి మంత్రి వర్గంలో ఛాన్స్ లభించదంటున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి కమ్మ, ఎస్సీ, కాపుల వంటి వారినే జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతన్నారు.

ఈసారి కూడా….

ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీలో కీలకంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో లోకేష్ మీద ఆయన గెలిచారు. అప్పుడు ప్రచారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ అనేక రోడ్ షోలలో చెప్పారు. దీంతో రెండో విడత ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ సామాజికవర్గ సమీకరణాలతో ఈసారి కూడా ఆళ్లకు ఛాన్స్ లేదంటున్నారు.

మరోసారి పోటీకి….

ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కు నమ్మకమైన నేత. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిపదవని సహజంగానే ఆశిస్తారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో? లేదో? తెలియని పరిస్థితి ఉంది. గత ఎన్నికల సమయంలోనే ఆయన పోటీకి దూరంగా ఉంటానని చెప్పి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈపరిస్థితుల్లో మంత్రి పదవి ఆళ్లకు ఇవ్వాల్సిందేనని ఆయన సన్నిహితులు కోరుతున్నారు.

ఈ కోటా కింద….

గుంటూరు జిల్లాలో అనేక మంది సీనియర్ నేతలున్నారు. అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తాఫా వంటి నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో అంబటి రాంబాబు, ముస్తాఫాలకు లభించే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని తెలుస్తోంది. మైనారిటీ కోటా కింద ఈసారి ముస్తాఫాకు ఇచ్చి, అంబటి రాంబాబును కూడా మంత్రివర్గంలోకి జగన్ తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో జగన్ ఈసారి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.

Tags:    

Similar News